Fri Dec 05 2025 21:51:59 GMT+0000 (Coordinated Universal Time)
ప్రకాశంలో కరోనా కలకలం
ప్రకాశం జిల్లాలో కరోనా కేసు నమోదయింది. కరోనా కేసు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యా

ప్రకాశం జిల్లాలో కరోనా కేసు నమోదయింది. చాలా రోజుల తర్వాత కరోనా కేసు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన ఒక వ్యక్తి జ్వరంతో బాధపడుతూ గుంటూరు సమీపంలోని ఒక ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. అతనికి కరోనా పాజిటివ్ గా తేలడంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. సర్జరీ నిమిత్తం గుంటూరుకు వెళ్లగా కరోనా పరీక్షలు చేస్తే పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
జ్వరపీడితులను...
దీంతో జిల్లా అధికారులు జిల్లా వ్యాప్తంగా జ్వరపీడితులను గుర్తించే పనిలో పడ్డారు. కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది గుమికూడిన చోటకు మాస్క్ లేకుండా వెళ్లొద్దని సూచిస్తున్నారు. పండగలు, పెళ్లిళ్ల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Next Story

