Sun Mar 15 2026 23:12:07 GMT+0530 (India Standard Time)
రఘురామపై కేసు నమోదు
నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజుపై కేసు నమోదయింది

నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజుపై కేసు నమోదయింది. ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ ను తన ఇంట్లో నిర్బంధించినందుకు ఆయనపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ ను బంధించడమే కాకుండా ఆయనపై దాడి చేశారని కేసు నమోదయింది.
కానిస్టేబుల్ నిర్బంధంపై....
ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ పై దాడి చేసిన కేసులో ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏ1 గా, ఆయన కుమారుడు భరత్ లను ఏ2 నిందితులుగా ఎఫ్ఐఆర్ లో పెట్టారు. వీరితో పాటు సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ ఏ3గానూ, సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సందీప్ ఏ 2గాను, రఘురామ పీఏ శాస్త్రి ఏ 5 నిందితుడిగా చేర్చారు.
Next Story

