Tue Mar 24 2026 09:23:22 GMT+0530 (India Standard Time)
సోషల్ లో 23 మార్కులు.. పునఃమూల్యాంకనం చేయిస్తే 96 మార్కులు
పదో తరగతి ఫలితాల్లో ఐదు సబ్జెక్టుల్లో 90కి పైగా మార్కులు తెచ్చుకున్న ఓ విద్యార్థిని సోషల్ స్టడీస్ లో ఫెయిల్ అయినట్లు వచ్చింది.

పదో తరగతి ఫలితాల్లో ఐదు సబ్జెక్టుల్లో 90కి పైగా మార్కులు తెచ్చుకున్న ఓ విద్యార్థిని సోషల్ స్టడీస్ లో ఫెయిల్ అయినట్లు వచ్చింది. అయితే రీవాల్యుయేషన్ లో ఏకంగా 96 మార్కులు వచ్చాయి. బాపట్ల జిల్లా కొల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన ఈమని తేజస్వినికి ఇలా జరిగింది.
మొదట సోషల్ లో 23 మార్కులే వచ్చినట్లుగా చూపించగా.. పునఃమూల్యాంకనం చేయిస్తే ఏకంగా 96 మార్కులు వచ్చాయి. మొత్తం మార్కులు 575కు చేరాయి. మే 20లోపు ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవాలని, ఈ పరిణామాల కారణంగా ఆ గడువు దాటిపోయిందని విద్యార్థిని తల్లిదండ్రులు బాధను వ్యక్తం చేస్తున్నారు. తేజస్వినికి ఓ అవకాశం కల్పించాలని అందరూ కోరుతున్నారు.
Next Story

