Wed Jan 28 2026 19:47:34 GMT+0000 (Coordinated Universal Time)
2 కిలోల పులస చేప.. 26,000 రూపాయలు
పులస చేప ఎప్పటికప్పుడు రికార్డు ధరలకు అమ్ముడుపోతూ ఉంది.

పులస చేప ఎప్పటికప్పుడు రికార్డు ధరలకు అమ్ముడుపోతూ ఉంది. యానాంలో 2 కేజీల పులస చేపను ఏకంగా 26వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేవారు. ఈ చేపను ఆత్రేయపురం పేరవరం వాసి సతీష్ వేలంలో దక్కించుకున్నారు. వారం రోజుల్లోనే రికార్డు ధరకు అమ్ముడుపోయాయి రెండు పులసలు. ఇంతకు ముందు 18వేలు, 22వేలు పలకగా ఇప్పుడు ఏకంగా 26వేలు ధర పలికింది. ఈ సీజన్లో గోదావరిలోకి ఎర్రనీరు రావడంతో పులసలు పడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో పులస చేపలకు మంచి పేరున్నా వాటి లభ్యత తగ్గిపోతోందని మత్య్సకారులు చెబుతూ ఉన్నారు. పులసలు సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి గోదావరిలోకి వెళుతూ వలకు చిక్కుతూ ఉంటాయి.
Next Story

