Sun Mar 08 2026 00:33:54 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా
19వ రోజు జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు ప్రారంభం కానుంది. తూర్పు గోదావరి జిల్లాలో యాత్ర సాగనుంది

19వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు ప్రారంభం కానుంది. రాత్రి బస చేసిన ఎస్టి రాజపురం నుంచి ఈరోజు ఉదయం బయలుదేరే బస్సు యాత్ర రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ రోడ్ కు చేరుకుంటుంది. అక్కడ జగన్ బోజన విరామానికి ఆగుతారు. తిరిగి ఉందురు క్రాస్, కాకినాడ్ బైపాస్ మీదుగా సాయంత్రం 3.30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద జరగనున్న బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.
రాత్రికి బస...
అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి, తుని, పాయకరావుపేట మీదుగా గొడిచర్ల క్లాస్ వద్ద నైట్ క్యాంప్ కు చేరుకుంటారు. జగన్ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం జరిగే ఈ బహిరంగ సభలో పార్లమెంటు నియోజవర్గ పరిధిలోని అభ్యర్థులను జగన్ ప్రజలకు పరిచయం చేయనున్నారు.
Next Story

