Thu Jan 22 2026 13:40:54 GMT+0000 (Coordinated Universal Time)
నియంత జగన్ ఇక అధికారంలోకి రావడం కల్ల
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్ర అధికారం అనే కుర్చీ కోసమే తప్ప ప్రజల కోసం కాదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఒకసారి అధికారమిస్తే రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టాదరన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అవినీతి, దోపిడీ, వ్యవస్థీకృత నేరాలతో నిండిపోయిందని యనమల రామకృష్ణుడు తెలిపారు. జగన్ ప్రవర్తన హిట్లర్, తుగ్లక్ వంటి వారి మాదిరిగా ఉంటుందన్నారు.
ప్రజాస్వామ్యం పేరుతో...
ప్రజాస్వామ్యం పేరుతో జగన్ నియంతృత్వ, ఫ్యాక్షనిస్ట్ స్వభావం మళ్లీ బయటపడుతోందన్న యనమల రామకృష్ణుడుప్రజలు ఇక ఎప్పటికీ జగన్ను నమ్మరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్ర చేసినా, మోకాళ్ల మీద నడిచినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, మరోసారి రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే నిర్ణయాన్ని ప్రజలు తీసుకోరని యనమల రామకృష్ణుడు అన్నారు.
Next Story

