Sat Dec 13 2025 22:35:12 GMT+0000 (Coordinated Universal Time)
Vidadala Rajini : విడదలకు షాకివ్వనున్న జగన్.. ఈసారి ఎక్కడికో తెలుసా?
మాజీ మంత్రి విడదల రజనీకి వైసీపీ నాయకత్వం మరోసారి షాక్ ఇచ్చే అవకాశముంది

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. మాజీ మంత్రి విడదల రజనీని మరో నియోజకవర్గానికి పంపాలని నిర్ణయించినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి విజయం సాధించిన విడదల రజని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా జగన్ కేబినెట్ లో పనిచేశారు. అయితే అక్కడ వైసీపీ నేతలకు, నాటి ఎంపీ, ఎమ్మెల్సీకి పడకపోవడంతో 2024 ఎన్నికల్లో విడదల రజనీని గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా నియమించింది. అక్కడి నుంచే పోటీ చేయించింది. అయితే ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఓటమి పాలయింది. గుంటూరు వెస్ట్ నుంచి విడదల రజనీ కూడా ఓటమిపాలయ్యారు. అయితే ఆమె తనను తిరిగి చిలకలూరి పేట నియోజకవర్గం ఇన్ ఛార్జి గా నియమించారు.
పార్టీ పరిస్థితి బాగుపడకపోగా...
అయితే విడదల రజని వెళ్లిన తర్వాత పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగుపడలేదని పార్టీ నాయకత్వానికి సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో చిలకలూరిపేటలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని వైసీపీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలిసింది. విడదల రజనీని గుంటూరు జిల్లాలోని రేపల్లెకు విడదల రజనీని పంపే అవకాశాలున్నాయని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. చిలకలూరిపేట, గుంటూరు వెస్ట్ నియోజకవర్గం కంటే విడదల రజనీకి రేపల్లె సరైన నియోజకవర్గమని జగన్ కూడా భావిస్తున్నారు. దీంతో చిలకలూరిపేటలో కార్యక్రమాలు తగ్గించుకోవాలని రేపల్లెకు వెళ్లేందుకు సిద్ధం కావాలని అధిష్టానం స్పష్టమైన సమాచారం ఇచ్చినట్ల తెలిసింది. ఈనేపథ్యంలో మరోసారి విడదల రజనీ వర్గం తీవ్ర నిరాశలోకి వెళ్లింది.
త్వరలోనే అధికారిక ప్రకటన...
మాజీ మంత్రి విడదల రజనీ త్వరలో వైసీపీ ఇంచార్జ్ గా రేపల్లెకు బదిలీ అయ్యే అవకాశాలున్నాయని ఆమెకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. దీంతో విడదల రజనీ ఆశ్చర్యంతో పాటు అసంతృప్తికి గురయ్యారని చెబుతున్నారు.చిలకలూరిపేటలో ఆమె ఎప్పటికీ గెలిచే పరిస్థితి లేదని ఆమె ఎప్పటికీ అక్కడ బలమైన అభ్యర్థి కాలేరన్న అభిప్రాయం బలంగా ఉండటంతో ప్రత్యామ్నాయం చూడాలని జగన్ సిద్దపడినట్లు చెబుతున్నారు.రేపల్లెలో ప్రస్తుతం ఈపూరు గణేష్ ఇంచార్జ్ గా ఉన్నారు, కానీ ఆయన ఎక్కడా కనిపించడం లేదు. అక్కడ వైసీపీకి నాయకత్వం లేకుండా పోయింది.
అది బీసీల నియోజకవర్గం కావడం మత్స్యకార వర్గానికి చెందిన తెలంగాణ ముదిరాజ్ వర్గానికి చెందిన విడుదల రజనీ అయితే మంచి అభ్యర్థి అవుతారని వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Next Story

