Tue Mar 10 2026 12:43:36 GMT+0530 (India Standard Time)
నేడు కూడా అరసవిల్లిలో తాకని సూర్య కిరణాలు
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని నేడు కూడా సూర్య కిరణాలు తాకలేదు

అరసవల్లి సూర్యనారాయణ స్వామిని నేడు కూడా సూర్య కిరణాలు తాకలేదు. ప్రతి ఏడాది మార్చి 9, 10, అక్టోబర్ 1, 2 తేదీల్లో స్వామివారిని సూర్యకిరణాలు తాకుతాయని, ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకూ సూర్యకిరణాలు తాకలేదని అక్కడి పూజారులు చెబుతున్నారు. ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తుందని చెబుతున్నారు.
మంచు ప్రభావంతో...
అయితే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉదయం నుంచి మంచు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఉదయం వేళ సూర్యకిరణాలు తాకాల్సి ఉండగా మంచు ప్రభావంతో అవి తాకలేదని ఆలయ పూజారులు చెబుతున్నరు. నేడు కూడా సూర్యకిరణాలు స్వామి వారిని తాకలేదని, అక్టోబర్ 1, 2 తేదీల్లో సూర్యకిరణాలు తాకే అవకాశం ఉందని చెబుతున్నారు. సూర్యకిరణాలు తాకిన సందర్భంలో స్వామి వారిని చూడాలని పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
Next Story

