Sun Mar 22 2026 10:20:49 GMT+0530 (India Standard Time)
Tiger : పోలవరం జిల్లాలోనే పెద్దపులి
పోలవరం జిల్లా గంగవరం మండలంలో పెద్దపులి సంచరిస్తుంది

పోలవరం జిల్లా గంగవరం మండలంలో పెద్దపులి సంచరిస్తుంది. గంగవరం మం.లోని గ్రామాల ప్రజలకు అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ జిల్లా నుంచి పోలవరం ప్రాంతంలోకి ప్రవేశించిన పెద్దపులి అక్కడే తిరుగాడుతుంది. అయితే అది ఎవరిపైనా దాడులు చేయడం లేదని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ప్రమాదకారి అంటూనే....
పశువుల మీద దాడులు చేస్తుందని, ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, అయితే తగిన జాగ్రత్తలు పొలాలకు వెళ్లే సమయంలో తీసుకోవాలని సూచిస్తున్నారు. గోకవరం మండలం మల్లవరం గ్రామ ప్రజలకు అటవీశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పోలవరం డీఎఫ్వో శివకుమార్, అడ్డతీగల సబ్ డీఎఫ్వో సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పెద్దపులిని బంధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Next Story

