Sat Dec 13 2025 22:35:55 GMT+0000 (Coordinated Universal Time)
విద్యార్థులతో ఈ టీచర్ ఏం చేసిందో చూడండి
శ్రీకాకుళం జిల్లాలో ఒక మహిళ టీచర్ చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

ఉపాధ్యాయులు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడం మానేసి కొందరు పాఠశాలకు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక మహిళ టీచర్ చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విద్యార్థుల చేత కాళ్లు నొక్కించుకుంటూ మహిళ టీచర్ చేసిన నిర్వాకంపై జిల్లా విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాళ్లు నొక్కించుకుని...
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఇక్కడి ఉపాధ్యాయురాలు సెల్ ఫోన్ లో మాట్లాడుతూ.. ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటున్న వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ విషయంపై ఐటీడీఏ సీతంపేట పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ మాట్లాడుతూ.. సంబంధిత ఉపాధ్యాయురాలికి ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేశామని, విచారణకు ఆదేశించామని చెప్పారు
Next Story

