Sat Mar 07 2026 10:06:17 GMT+0530 (India Standard Time)
Vijayawada : ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం
విజయవాడ ఇంద్రకీలాద్రి పై కుంభాభిషేjక ఉత్సవాలు రెండో రోజు యాగశాలలో నిర్వహించనున్నారు

విజయవాడ ఇంద్రకీలాద్రి పై దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కుంభాభిషేక మహోత్సవాలు రెండవ రోజు యాగశాలలో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు వివిధ పవిత్ర నదీ జలాలు, సముద్ర జలాలతో అష్టోత్తర కలశస్థాపన, పీఠ పూజలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12గంటలకు యాగశాలలో మూలమంత్రహవనములు నిర్వహించనున్నారు.
రేపటితో ముగియనున్న...
సాయంత్రం 4 గంటల నుంచి మూలమంత్రహవనములు, ప్రదోషకాల పీఠపూజలు మరియు హారతి కార్యక్రమాలు ఉంటాయి. రాత్రి 7 గంటలకుమంత్రపుష్పంతో నేటి కార్యక్రమాలు ముగుస్తాయి కుంభాభిషేక మహోత్సవం ముగియనుంది. ఈ పవిత్ర క్రతువులో భాగంగా కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి పర్యవేక్షణలో కుంభాభిషేకం జరుగనుంది .
Next Story

