Sat Dec 13 2025 22:32:16 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్... దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కార్తీకమాసంలోని చివరి సోమవారం కావడంతో భక్తుల అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. జనవరి నెల చివర వరకూ తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.
రేపు ఆర్జిత సేవా టిక్కెట్లు...
రేపు టీటీడీ శ్రీవారి ఫిబ్రవరి నెల కోటా టిక్కెట్లను విడుదల చేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను నవంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు నవంబర్ 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఇరవై రెండు కంపార్ట్ మెంట్లలో
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 75,004 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,900 మంది భక్తుల తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.98 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

