Sat Dec 13 2025 19:29:56 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు శనివారం వెళ్లే వారికి గుడ్ న్యూస్... దర్శనం?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం అయినా భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం అయినా భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం ఏడు కొండల వాడిని దర్శించుకుంటే శుభప్రదమని ఎక్కువ మంది నమ్ముతారు. అందుకే శనివారం భక్తులతో తిరుమల ఎప్పుడైనా రద్దీగా ఉంటుంది. ఇక సాధారణ రోజుల్లోనూ ఇటీవల కాలంలో తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నారు. కేవలం క్యూ లైన్ లో ఉన్న వారికి మాత్రమే కాకుండా వసతి గృహాల విషయంలోనూ భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
వసతి గృహాల కోసం...
తిరుమలలో భక్తులకు స్వామి వారి దర్శనం ఎంత కష్టమవుతుందో.. వసతి గృహాలను దక్కించుకోవడం కూడా అంతే కష్టంగా మారుతుంది. తిరుమలకు వచ్చే వారు ముందుగానే వసతి గృహాన్ని బుక్ చేసుకున్నప్పటికీ అప్పటికే ఉన్న వారు ఖాళీ చేస్తేనే వరస క్రమంలో వారికి గదులను కేటాయించడం సంప్రదాయంగా వస్తుంది. భక్తులకు ఒకరోజు గదిలో ఉండేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. దర్శనం కాకపోతే మరొకరోజు గదిని అద్దె చెల్లించి పొడిగించే వీలుంది. అందుకే గదులు త్వరగా లభ్యం కావడం లేదు.
పన్నెండు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పన్నెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 66,709 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 24,053 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.03 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

