Fri Mar 20 2026 20:09:06 GMT+0530 (India Standard Time)
Road Accident : ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం మండలం దేవలం పల్లె చెక్ పోస్టు వద్ద అంబులెన్స్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. బెంగళూరు నుంచి కడపకు కుటుంబ సమేతంగా కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇద్దరు మృతి చెందగా...
కారులో మొత్తం ఏడుగురు ఉండగా అందులో ఇద్దరు మరణించారు. మృతులను ప్రవీణ్, శ్రీకాంత్ లుగా గుర్తించారు. మిగిలిన వారు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంబులెన్స్ డ్రైవర్ కు కూడా గాయాలయ్యాయి. పొగమంచు, అతివేగం ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

