Tue Apr 07 2026 02:21:23 GMT+0530 (India Standard Time)
Road Accident : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లిలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొట్టడంతో అక్కడే ఇద్దరు యువకులు చనిపోయారు. మృతులను బోడిగుట్టపల్లి వాసి భూపాల్ రెడ్డి, యల్లంపల్లి వాసి మల్లికార్జున్ గా పోలీసులు గుర్తించారు.
అతివేగమే కారణం...
అతి వేగం, నిర్లక్ష్యంపు డ్రైవింగ్ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగానికి బ్రేకులు వేయాలని పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు.
Next Story

