Fri Mar 20 2026 13:50:49 GMT+0530 (India Standard Time)
Road Accident : రాజమండ్రి నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం
రాజమండ్రి నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు

రాజమండ్రి నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. రోడ్ కం రైల్వే వంతెనపై రెండు బైక్ లు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. రెండు బైక్ లు వేగంగా వస్తూ ఒకదానిని ఒకటి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి గల కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.
ముగ్గురు మృతి...
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలికి చేరుకుని అక్కడ ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు యువకులు మరణించడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అతి వేగం ప్రాణాలు తీసిందని పలువురు చెబుతున్నారు.
Next Story

