Mon Mar 09 2026 11:51:01 GMT+0530 (India Standard Time)
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీసీ టీవీ విజువల్స్ చూస్తే?
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఒకరు మరణించగా, పన్నెండు మంది వరకూ గాయపడ్డారు. ఎచ్చెర్ల మండలం జరజం గ్రామ పరిధిలోని NH16పై అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి ప్యాసింజర్ ఆటోను కారు ఢీకొట్టింది. ఆటోలోని ప్యాసింజర్లు ఎగిరిపడగా, ఒకరు మృతిచెందినట్లు, మరో 12 మంది గాయాలపాలైనట్లు సమాచారం.
గాయపడిన వారిని...
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు ఎవరన్నది తెలియరాలేదు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాధమికంగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

