Wed Mar 04 2026 11:36:09 GMT+0530 (India Standard Time)
Breaking : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. గంగవరం మండలం వై జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. కంటైనర్ ను వెనక నుంచి కారు ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. బెంగళూరు నుంచి తిరుపతి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు.
తిరుపతి వెళుతుండగా...
ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు సహాయక కార్యక్రమాలను చేపట్టారు. ఈ ప్రమాదంలో కొందరు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

