Mon Apr 06 2026 11:48:34 GMT+0530 (India Standard Time)
Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం దండపల్లి క్రాస్ రోడ్స్ లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. కంటైనర్ ను వెనక నుంచి కారు ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. లారీ కిందకు కారు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ఇద్దరు మరణించారు.
మృతులు ఇద్దరు...
మృతులు ఇద్దరు తిరుపతి వాసులుగా గుర్తించారు. తిరుపతిలోని కోర్టులో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న యుగంధర్, హరీశ్ లుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

