Fri Apr 03 2026 11:41:27 GMT+0530 (India Standard Time)
Road Accident : అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి స్పాట్ డెడ్
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. అనకాపల్లి జిల్లాలోని పోతిరెడ్డిపాలెం జంక్షన్ దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. ఒక ట్రావెల్ బస్సు బైకును ఢీకొట్టడంతో బైకుపై ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు
మృతులను...
మృతులను నాని, గోవిందు, దుర్గాప్రసాద్ లుగా పోలీసులు గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story

