Mon Feb 02 2026 13:27:17 GMT+0000 (Coordinated Universal Time)
జోగి రమేష్ ఇంటిపై దాడి కేసులో ట్విస్ట్.. టీడీపీ నేతలపై కేసులు
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం నలభై మంది జోగి రమేష్ ఇంటిపై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో పదకొండు మందిని ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నలభై మంది ఈ దాడికి పాల్పడినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. పోలీసులు గుర్తించిన వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాడి చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేశారు.
పదకొండు మందిని...
ఇందులో ప్రస్తుతం పదకొండు మందిని మాత్రమే గుర్తించారు. మిగిలిన వారిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జోగి రమేష్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నిన్న ఇబ్రహీం పట్నంలోని జోగి రమేష్ ఇంటిపై పెట్రోలు సీసాలు విసిరి నిప్పుపెట్టడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. చట్టాన్ని చేతిలో తీసుకున్న వారిని ఎవరినీ వదిలి పెట్టేది లేదని పోలీసులు హెచ్చరించారు.
Next Story

