Fri Apr 03 2026 11:37:12 GMT+0530 (India Standard Time)
మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు
మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఒక భవనం కూల్చివేత సందర్భంగా పేర్ని నాని స్థానిక పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలను...
ఇదే వివాదంలో పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు పేర్ని కిట్టుపై కూడా కేసు నమోదయింది. కొబ్బరితోట ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రక్రియలో భాగంగా జరిగిన వివాదంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసు అధికారుల సంఘం ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story

