Sat Dec 13 2025 22:33:15 GMT+0000 (Coordinated Universal Time)
Perni Nani : చంద్రబాబు ఉంటే అతివృష్టి..లేకుంటే అనావృష్టి
చంద్రబాబు అధికారంలోకి వస్తే అతివృష్టి లేదా అనావృష్టి అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.

చంద్రబాబు అధికారంలోకి వస్తే అతివృష్టి లేదా అనావృష్టి అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర ఉందో చెప్పాలని నాని ప్రశ్నించారు. ఏ పంట వేసిన రైతు ఆనందంగా ఉన్నారో చెప్పాలని కోరారు. ధర లేక ధాన్యాన్ని దగ్దం చేస్తున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి, పొగాకు, మామిడి, పసుపు, ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు.చంద్రబాబు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్కచోటైనా కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను పెట్టారా? అని ప్రశ్నించారు. రైతులు కాలరెగరేసుకునేలా చేస్తానని అంటే ఇరవై మాసాల్లో వంటి మీద చొక్కా కూడా లేని పరిస్థితి వస్తుందని పేర్ని నాని అన్నారు.
దిక్కుమాలిన పరిపాలన అంటూ...
దిక్కుమాలిన పరిపాలన వల్ల రైతులను గాలికి వదిలేస్తున్నారని అన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి రైతన్నా మీ కోసం అని కార్యక్రమం పెట్టారని, ఎందుకోసం అని పేర్ని నాని ప్రశ్నించారు. పంటలను కొనేదిక్కు లేక అన్నదాతలు ఏడుస్తుంటే రైతుల వద్దకు ఎమ్మెల్యేలను పంపిస్తే మంచిదేనని పేర్ని నాని సెటైర్ వేశారు. గన్ మెన్ లు, పోలీసులు లేకుండా ఎమ్మెల్యేలను రైతుల వద్దకు పంపించాలంటూ సవాల్ విసిరారు. పంచ సూత్రాలు రైతులకు చెప్పడం కాదని, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ మంత్రి పేర్ని నాని కోరారు.
Next Story

