Thu Mar 19 2026 05:36:15 GMT+0530 (India Standard Time)
నేడు కోటప్పకొండకు పవన్ కల్యాణ్
నేడు పల్నాడు జిల్లాలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు

నేడు పల్నాడు జిల్లాలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని పవన్ కల్యాణ్ దర్శించుకోనున్నారు. నూతనంగా నిర్మించిన కొత్తపాలెం రోడ్డు ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. పవన్ కల్యాణ్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పెద్ద సంఖ్యలో...
పవన్ కల్యాణ్ పల్నాడు జిల్లా కోటప్పకొండకు వస్తున్నారని తెలిసి చుట్టు పక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చే అవకాశముంది. ఆయనను చూసేందుకు అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా తరలి వచ్చే అవకాశముండటంతో కోటప్పకొండ లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు అనుమతి ఉన్న వారినే పంపిస్తున్నారు.
Next Story

