Mon Mar 16 2026 21:48:36 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : కాశీబుగ్గ తొక్కిసలాటపై పవన్ ఏమన్నారంటే?
శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించా

శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. అత్యంత దురదృష్టకరమైన ఘటన అని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు చనిపోవడం బాధకలిగిస్తుందని పవన్ కల్యాణ్ ఆవేదన చెందుతున్నారు.
ఇటువంటి రోజుల్లో...
గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిలా చూడాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మికంగా విశిష్టమైన రోజుల్లో ఆలయాల వద్ద ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ అధికారులను కోరారు.
Next Story

