Wed Mar 25 2026 10:33:18 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో ఊరట
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో ఊరట లభించింది.

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. పవన్ సినిమాల్లో నటించకూడదని మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. విజయ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సినిమా కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పిటిషన్ లో విజయ్ కుమార్ పేర్కొన్నారు. టికెట్ ధర పెంపు విషయంలో నిబంధనలు పాటించలేదన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలను తోసిపుచ్చింది.
సినిమాల్లో నటించడంపై...
సినిమాల్లో నటించడం, ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తించడం పరస్పర విరుద్ధమని న్యాయవాది తన వాదనను వినిపించారు. మంత్రుల పదవుల్లో ఉన్నవారు సినిమాల్లో నటించడంపై నిషేధం లేదని అడ్వకేట్ జనరల్ వాదించారు. సీనియర్ ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పుఇచ్చిందని ఏజీ గుర్తు చేశారు. టికెట్ ధరలు పెంచే విషయంలో పవన్‌కు సంబంధం లేదని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయస్థానానికి తెలిపారు. వాదనల తర్వాత ఇటీవల తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి, తాజాగా విజయ్‌కుమార్ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చారు.
Next Story

