Tue Mar 24 2026 14:54:59 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : జనసేన ఎమ్మెల్యేలతో పవన్ భేటీ
విజయవాడలో జనసేన ఎమ్మెల్యేలతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు

విజయవాడలో జనసేన ఎమ్మెల్యేలతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలోని నోవాటెల్లో సమావేశం ప్రారంభమయింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చిస్తున్నారు. జనసేన క్రియాశీలక సభ్యత్వంపైనా సమావేశంలో చర్చించనున్నారు.
పలు కీలక అంశాలపై...
ఇప్పటికే జనసేన పార్టీ సభ్యత్వాలు పదిహేను లక్షలకు చేరాయి. సభ్యత్వ గడువు పెంచే విషయంలో నేటి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. దీంతో పాటు నేతలు వివాదాలకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా వివాహేతర సంబంధాలు, ఇతర నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పవన్ కల్యాణ్ హెచ్చరించనున్నారు.
Next Story

