Wed Mar 18 2026 09:27:28 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేడు చంద్రబాబుతో పవన్ భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబును ఈరోజు మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలవనున్నారు

ముఖ్యమంత్రి చంద్రబాబును ఈరోజు మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలవనున్నారు. సీఎం చంద్రబాబును కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. కూటమి పార్టీ నేతల పై వరసగా వస్తున్న ఆరోపణలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది.
కీలక అంశాలపై చర్చ...
అలాగే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశముందని తెలిసింది. పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీ కీలకంగా మారనుంది. పార్టీ నాయకత్వం పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఇరువురు నేతలు కలసి చర్చించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి
Next Story

