Sat Dec 13 2025 22:43:18 GMT+0000 (Coordinated Universal Time)
దుబాయ్ లో మంత్రి నారాయణ నేడు
దుబాయ్ లో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతుంది.

దుబాయ్ లో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతుంది. రాష్ట్రానికి పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ వివిధ పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతున్నారు. నిన్న శోభా రియాల్టీ గ్రూప్, కేఈఎఫ్ హోల్డింగ్స్, బుర్జీల్ హోల్డింగ్స్ ప్రతినిధులతో వేరువేరుగా భేటీ అయిన మంత్రి నారాయణ వారితో చర్చించారు. హెల్త్ కేర్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా సంస్థలు ఆసక్తి కనబర్చినట్లు మంత్రి నారాయణ కార్యాలయం తెలిపింది. మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులకు శోభా రియాల్టీ గ్రూప్ ముందుకొచ్చింది.
విశాఖ సదస్సుకు...
ఈ నెల 14,15 తేదీల్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని ఆయా కంపెనీలకు మంత్రి నారాయణ ఆహ్వానం పలికారు. ఈరోజు దుబాయ్ లో పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశాల్లో మంత్రి నారాయణ పాల్గొనున్నారు. అపరెల్ గ్రూప్,ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, టబ్రీడ్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశం కానున్న మంత్రి నారాయణ షిప్పింగ్,లాజిస్టిక్స్ రంగంలో దుబాయ్ కేంద్రంగా అనేక దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తుంది. ఫ్యాషన్,ఫుట్ వేర్ రంగంలో అనేక దేశాల్లో ప్రసిద్ధి పొందిన ఆపరెల్ గ్రూప్ ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపుతుందని చెబుతున్నారు.
Next Story

