Tue Mar 10 2026 19:33:04 GMT+0530 (India Standard Time)
Nadendla Manohar : బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు : నాదెండ్ల మనోహర్
గ్యాస్ సరఫరాపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష చేశారు

అంతర్జాతీయంగా యుద్ద వాతావరణం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు, సరఫరాపై రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష చేశారు. సమీక్షలో మనోహర్ కొన్ని ముఖ్యమైన సూచనలను అధికారులకు చేశారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గృహ అవసరాలు, వాణిజ్య అవసరాలకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
గ్యాస్ పై పర్యవేక్షణ...
గ్యాస్ ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా ఉన్నతాధికారులు జిల్లాల వారీగా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లా వారీగా గ్యాస్ బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా ప్రత్యేకంగా నిఘా బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో కృత్రిమ కొరత సృష్టించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ** బ్లాక్ మార్కెట్ లో గ్యాస్ అమ్మే వారి సమాచారాన్ని ప్రజలు అధికారులకు అందించాలే అధికారులు చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రజలు ఏమాత్రం ఇబ్బంది పడకుండా అధికారులు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Next Story

