Tue Apr 07 2026 05:25:21 GMT+0530 (India Standard Time)
జగన్ తో దువ్వాడ శ్రీనివాస్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిశారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిశారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని బాయ్ కాట్ చేసి వెళుతున్న సందర్భంగా జగన్ తో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ సస్పెండ్ చేసింది. సస్పెండ్ విషయమై ఆయన మాట్లాడారా? తనను తిరిగి పార్టీలో చేర్చుకునే విషయంపై ఆయనతో మాట్లాడారా? అన్న క్లారిటీ లేదు.
సస్పెన్షన్ వ్యవహారంపై...
దువ్వాడ శ్రీనివాస్ కు మాత్రం తర్వాత మాట్లాడదాం అని జగన్ చెప్పినట్లు అక్కడి వరాు చెబుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్, మాధురిల వివాదంతో పార్టీ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారు. దీంతో తిరిగి ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. తనకు వైసీపీలో అవకాశం ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్నారు.
Next Story

