Sat Dec 13 2025 22:34:15 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : మళ్లీ తుపాను ముప్పు.. అటు వైపుగా వస్తుందట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వానలు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఈరోజు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలోనిమధ్య ప్రాంతంలో వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని చెప్పింది. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వానలు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ వర్షాల నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముందనివాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఈ నెల27వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ భారీ వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మూడు రోజులు భారీ వర్షాలు...
ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. రేపు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. మోంథా తుపాను ముప్పు నుంచి బయటపడకముందే మరొక తుపాను వస్తుందని తెలియడంతో ప్రధానంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. వరస తుపానులు ఏపీని ఇబ్బంది పెడుతున్నాయి. కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నెంబర్లుగా 112,1070, 1800, 42 50101 ను ఏర్పాటు చేసింది.
చలి తీవ్రత మరింత...
తెలంగాణ రాష్ట్రంలోనూ వానలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది. అదే సమయంలో ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ తెలంగాణలో పలు చోట్ల మోస్తరు నుంచి తేలిక పాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే చలితీవ్రత మాత్రం కొనసాగుతుందని పేర్కొంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గుతాయని కూడా తెలిపింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. పది జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలిఎక్కువగా ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Next Story

