Fri Jan 09 2026 20:41:43 GMT+0000 (Coordinated Universal Time)
Srisailam : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల సమావేశం
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం జరగనుంది

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం జరగనుంది. నంద్యాల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సమావేశం జరగనుంది. సమావేశానికి పలు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు. హాజరుకానున్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయంలో తీసుకోవాల్సిన ఏర్పాట్లపై చర్చించనున్నారు.
పెద్ద సంఖ్యలో భక్తులు...
శివరాత్రికి పెద్ద సంఖ్యలో శ్రీశైలానికి భక్తులు తరలి వస్తారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా శ్రీశైలంలో ఏర్పాట్లతో పాటు వసతితో పాటు ఇతర సౌకర్యాలపై కలెక్టర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి దేవస్థానం ఛైర్మన్, ఈవో, ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారులు, నంద్యాల, మార్కాపురం, నాగర్‌కర్నూలు జిల్లాల ఎస్పీలు హాజరుకానున్నారు వచ్చే నెల 8 నుంచి 18 వరకు శ్రీశైలంలో జరుగునున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
Next Story

