Tue Feb 10 2026 18:24:09 GMT+0530 (India Standard Time)
షాతో బాబు యాభై నిమిషాల భేటీ.. దేనిపైన అంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ యాభై నిమిషాలు కొనసాగింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ యాభై నిమిషాలు కొనసాగింది. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితం అమిత్ షాను కలుసుకున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఇద్దరు ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. తిరుమల లడ్డూ వ్యవహారం కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. రాజధాని అమరావతి చట్టబద్ధతపై కూడా చర్చించారంటున్నారు.
రాజ్యసభ స్థానాలపై...
అలాగే రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలను కూడా చంద్రబాబు అమిత్ షాతో చర్చించారని తెలిసింది. ప్రధానంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులతో పాటు రావాల్సిన నిధులు విడుదలపై కూడా అమిత్ షాను కోరారని చెబుతున్నారు. ఇక త్వరలో ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలపై కూడా చంద్రబాబు అమిత్ షాతో చర్చించినట్లు తెలిసింది. కూటమి పంపకాలపై షా నుంచి చంద్రబాబు క్లారిటీ తీసుకున్నారని చెబుతున్నారు.
Next Story

