Sat Dec 13 2025 22:33:48 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మోస్ట్ వాంటెండ్ మావోయిస్టు హిడ్మా మృతి?
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి చెందారని చెబుతున్నారు

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి చెందారని చెబుతున్నారు. మారేడుమిల్లిలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి చెందినట్లు సమాచారం. ఆయన భార్య అనుచరులు కూడా మృతి చెందినట్లు తెలిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో హిడ్మాతో పాటు చెల్లూరి నారాయణ మరణించినట్లు కూడా సమాచారం. హిడ్మాపై కోటి రూపాయల రివార్డు ఉంది. ఆయన భార్య హేమపై యాభై లక్షల రివార్డు ఉంది. అనేక ఆపరేషన్ లలో హిడ్మా కీలకంగా ఉన్నారు. అలాగే ఒడిశా, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కీలక నేతగా ఉన్నారు. హిడ్మాకు హిందీ, తెలుగు, బెంగాలీ, గోయ బాషల్లో పట్టుంది.
కోటి రివార్డు...
మొత్తం ఆరుగురు ఈ ఎన్ కౌంటర్ లో మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడుమిల్లిలో పోలీసులు మరియు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పుల్లో వీరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఉదయం 6 గంటల నుంచి ఏడు గంటల మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోల కదిలికపై సమాచారం అందడంతో ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలిసింది. అధికారులు దీనిపై ధృవీకరించాల్సి ఉంది. భారీ ఆపరేషన్లలో హిడ్మాకు పేరుంది. ఎన్నోసార్లు భద్రతాదళాల దాడుల నుంచి హిడ్మా తప్పించుకున్నాడు. హిడ్మా దళానికి అత్యంత శక్తివంతమైన దళంగా పదేరుంది. హిడ్మా పూర్తి మాడ్వా హిడ్మా. ఆయన అనేక పేర్లతో మూడు రాష్ట్రాల్లో తిరుగుతుంటారు. అయితే ఇరవై ఐదేళ్ల క్రితం హిడ్మా అడవుల్లోకి వెళ్లాడు.
Next Story

