Thu Jan 29 2026 11:57:25 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ప్రయివేటు ట్రావెల్స్ బస్సులపై తనిఖీలు ముమ్మరం
Andhra Pradesh : ప్రయివేటు ట్రావెల్స్ బస్సులపై తనిఖీలు ముమ్మరం

కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రయివేటు ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలను ముమ్మరం చేసింది. గత మూడు రోజుల నుంచి ప్రయివేటు బస్సుల్లో అనుమతులు, ఫిట్ నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్, సీట్లను ఎక్కువగా చేయడం వంటి వాటిపై ఎక్కువగా తనిఖీలు చేస్తూ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తుంది.
నిబంధనలు ఉల్లంఘించి...
ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఆల్ ఇండియా పర్మిట్ తో ఇక్కడ తిరుగుతున్న వాటిపై ఎక్కువ దృష్టి పెట్టింది. పార్శిళ్లు తీసుకు వెళ్లే వాటిపై కూడా కేసులు నమోదు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయివేటు బస్సుల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలను పాటించని వారిపై జరిమానాలు కూడా విధిస్తున్నారు. ఇప్పటి వరకూ 361 బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని గుర్తించారు. నలభై బస్సులను సీజ్ చేశారు.
Next Story

