Thu Feb 05 2026 07:52:14 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ భూముల విషయంలో ఏపీ సర్కార్ కు హైకోర్టు షాక్
విశాఖలో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఏబీఎన్ ఛానల్‌కు ఏపీ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది

విశాఖలో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఏబీఎన్ ఛానల్‌కు ఏపీ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రభుత్వ భూమిని ఆంధ్రజ్యోతి కార్యాలయం కట్టుకోవడానికి ఇవ్వటాన్ని విశాఖకు చెందిన నక్క నమ్మి గ్రేస్ హైకోర్టులో సవాలు చేశారు. ఏపీలో ఉన్న పాలసీ ప్రకారం ప్రైవేట్ సంస్థలకు భూములు రాసిచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు.
ఏ చట్టాన్ని ఉపయోగించి...
ఏ చట్టాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూ బదలాయింపు చేసిందని? ఏమైనా సేల్ డీడ్ ప్రతివాదుల కంపెనీలకు రాసిందా అంటూ న్యాయస్థానంప్రశ్నించింది. అడ్వకేట్ జనరల్ రెండు వారాల సమయం కోరారు. ఏపీ ప్రభుత్వం పూర్తి వివరాలతో తిరిగి ప్రమాణ పత్రం దాఖలు చేయాలంటూ ఆదేశించిన హైకోర్టుపూర్తి వివరాలతో తిరిగి కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Next Story
