Fri Jan 30 2026 14:02:52 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని క్షణాల్లో
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శాటిలైట్ డేటాతో పౌర సమస్యలకు పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ శాఖలు 'అవేర్' విభాగాన్ని ఉపయోగించుకోవడం వల్ల పౌరులకు అనేక ప్రయోజనాలు లభించన్న్నారు. పట్టణాల్లోని అక్రమ నిర్మాణాలను ఉపగ్రహ చిత్రాల ద్వారా సులభంగా గుర్తించవచ్చు. భూమి సారవంతంపై సమగ్ర సమాచారాన్ని అందించడం ద్వారా రైతులకు సహాయం అందుతుంది.
ఉద్యోగ నియామకాల్లోనూ...
ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఉద్యోగార్థులు, విద్యార్థులకు ఇది మరో పెద్ద ఊరట. ఉద్యోగ నియామక ప్రక్రియల్లో అభ్యర్థులు సమర్పించే సర్టిఫికెట్ల భౌతిక ధృవీకరణకు చాలా సమయం పడుతుంది. ఆర్టీజీఎస్ ప్రత్యేకంగా తెచ్చిన 'డిజీ వెరిఫై' సదుపాయంతో... సర్టిఫికెట్లు అసలైనవా, నకిలీవా అనేది ఇక కేవలం క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఇది పౌరుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది.
Next Story

