Sun Feb 15 2026 19:49:40 GMT+0530 (India Standard Time)
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం.. మంచి ముహూర్తాలు ఎప్పుడంటే?
ఈ నెల నుంచి శుభకార్యాలకు మంచి ముహూర్తాలున్నాయి. పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలో జరగనున్నాయి.

ఈ నెల నుంచి శుభకార్యాలకు మంచి ముహూర్తాలున్నాయి. పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలో జరగనున్నాయి. ఇన్నాళ్లు శుభ ముహూర్తాల కోసం చూసిన వారు ఈ నెల నుంచి ప్రారంభమయ్యే పెళ్లిళ్ల సీజన్ కోసం ముందుగానే ముహూర్తాలను నిర్ణయించుకున్నారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు ఈ నెల నుంచి డిసెంబరు వరకూ కొనసాగనున్నాయని పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మొదలుకానుంది. ఈ నెల 17తో శుక్ర మౌఢ్యమి ముగియడంతో 19వ తేదీ నుంచి పెళ్లి ముహూర్తాలు ప్రారంభం కానున్నాయని పండితులు చెబుతున్నారు.
మంచి ముహూర్తాలు ఇవే
ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26
మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12
ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29
మే: 1, 3, 5, 6, 7, 8, 13, 14
జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29
జులై: 1, 6, 7, 11
నవంబర్: 21, 24, 25, 26
డిసెంబర్: 2, 3, 4, 5, 6, 11, 12
Next Story

