Thu Jan 22 2026 06:29:38 GMT+0000 (Coordinated Universal Time)
భర్తను చంపేసి.. రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ..?
వివాహేతర సంబంధం మరో భర్తను బలికొంది.

వివాహేతర సంబంధం మరో భర్తను బలికొంది. ఇటీవల కాలంలో ప్రియుడితో కలసి భార్యలను భర్తలను హతమారుస్తున్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయి. మానవ సంబంధాలు మంట గలిసి పోతున్నాయి. కుటుంబ వ్యవస్థ కుప్పకూలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎదిగిన పిల్లలున్నప్పటికీ శారీరక సౌఖ్యం కోసం ఈరకమైన తెగింపునకు అనేక మంది పాల్పడుతున్నారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ మహిళ. డెడ్ బాడీ పక్కన కూర్చొని రాత్రంతా పోర్న్ వీడియోలు చూసింది. దీంతో బంధువులకు అనుమానం వచ్చింది.
ఇరవై ఏళ్ల క్రితం వివాహమయినా...
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కు చెందిన శివనాగరాజుకి భార్య లక్ష్మీమాధురికి 2007 లో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే మాధురి గతంలో విజయవాడలో ఒక సినిమా థియేటర్ లో టిక్కెట్ కౌంటర్ లో పనిచేసేది. ఆ సమయంలో సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అయితే భర్తను హైదరాబాద్ లో ట్రావెల్స్ వ్యాపారం చేస్తున్న గోపి వద్దకు ఉపాధి నిమిత్తం పంపింది. అయితే శివనాగరాజు అక్కడ ఉండకుండా తిరిగి ఇంటికి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నాడు.
నిద్రమాత్రలు కలిపి..
అయితే తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త శివనాగరాజును హతమార్చడానికి మాధురి ప్లాన్ చేసింది. బిర్యానీలో ఇరవై నిద్రమాత్రల పొడి కలిపి పెట్టింది. భర్త స్పృహ కోల్పోయాక ప్రియుడు గోపితో కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. గుండెపోటుతో మరణించాడని నమ్మబలికింది. చెవిలో రక్తం కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. మృతదేహం వద్ద పోర్న్ వీడియోలు చూస్తున్న బంధువులకు కూడా అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మాధురి, గోపిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

