Sat Dec 13 2025 22:34:55 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు నేడు వెళుతున్నారా? అయితే అలెర్ట్ గా ఉండాల్సిందే
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమల భక్తులతో కిటకిట లాడుతోంది. మాడ వీధులన్నీ గోవింద నామ స్మరణలతో మారుమోగిపోతున్నాయి. శనివారం కావడంతో భక్తులు ఏడుకొండల వాడిని దర్శించుకుంటే శుభప్రదమని నమ్ముతారు. అందుకే కొండకు శనివారరం వచ్చి స్వామి వారిని దర్శించుకునేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. శనివారం స్వామి వారి చెంత మొక్కులు తీర్చుకుంటే మంచిదని భావించిన భక్తులు అధిక సంఖ్యలో నేడు తిరుమలకు చేరుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
రానున్న కాలంలో...
శనివారం నుంచి ఆదివారం వరకూ తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. తిరుమలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్న ప్రసాదం, తాగునీటిని, మజ్జిగ వంటి సౌకర్యాలను కూడా కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వచ్చే నెలలో పండగలు, కొత్త ఏడాది, వైకుంఠ ఏకాదశి ఉండటంతో భక్తుల రద్దీ తిరుమలకు ఎక్కువగా ఉండనుంది.
పదిహేడు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదిహేడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 60,098 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో s : 24,962 మంది తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.75 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

