Mon Feb 02 2026 09:47:00 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : వైసీపీ ట్రాప్ లో పడొద్దు : చంద్రబాబు
ఏపీలో జరిగే అభివృద్ధి వైసీపీకి నచ్చడం లేదని, అందుకే కుట్రలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

ఏపీలో జరిగే అభివృద్ధి వైసీపీకి నచ్చడం లేదని, అందుకే కుట్రలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంత్రులు, సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ ట్రాప్ లో టీడీపీ నేతలు పడవద్దని కోరారు. వైసీపీ నేతలు తమ వ్యాఖ్యలతో లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించేందుకే వైసీపీ ఈ రకమైన విధానాలకు దిగుతుందని చంద్రబాబు అన్నారు. టీడీపీ కార్యకర్తలు సంయమనం కోల్పోకుండా వారిని నియంత్రించాల్సిన బాధ్యత మంత్రులు, సీనియర్ నేతలపై ఉందని చంద్రబాబు అన్నారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ...
గత ఇరవై నెలలుగా జరుగుతున్న ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ ఈ దారుణాలకు పాల్పడుతుందని తెలిపారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ తప్పు చేసినా చట్టపరంగా అందరిపైనా చర్యలు తీసుకుంటామని తెలపారు. ఏపీలో అలజడులు సృష్టించి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని చూస్తున్నారని, నేతలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు ఇలాంటి కుట్రలకు వైసీపీ తెరలేపుతుందని, అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Next Story

