Fri Mar 27 2026 18:43:30 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు అమిత్ షాతో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు. నేడు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో చంద్రబాబు సమావేశం కానున్నారు. పోలవరం - నల్లమల ప్రాజెక్టు విషయంపై చర్చించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. రాజ్యసభ సీట్ల పంపకంతో పాటు తిరుమల లడ్డూ వివాదంపై ఆయనతో చర్చించే అవకాశాలున్నాయి.
కేంద్రమంత్రులతో వరస సమావేశాలు...
మధ్యాహ్నం ఒంటి గంటకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రాబు సమవేశం అవుతారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమాశమవుతారు. అనంతరం సాయంత్రం నాలుగు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశమై విశాఖ రైల్వే జోన్ పై చర్చించే అవకాశముందని తెలిసింది. అనంతరం ఒక ప్రయివేటు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన అమరావతికి బయలుదేరి రానున్నారు.
Next Story

