Sun Feb 01 2026 18:17:46 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Prdesh : సూపర్ సిక్స్ ను సూపర్ గా సక్సెస్ చేశాం
సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి చూపించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు

సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి చూపించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు సాధ్యం కాదని కొందరు తమను గేలి చేశారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే అన్ని హామీలను అమలు చేసి చూపించామని చెప్పారు. కమలాపురంనియోజకవర్గం పెండ్లిమర్రిలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నగదును జమ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలను జమ చేశారు. ఇప్పటి వరకూ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లలో పదివేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని చంద్రబాబు తెలిపారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగానే...
కడపలో నిర్వహించిన మహానాడును సూపర్ సక్సెస్ చేశారన్నార. ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో ఉన్నారని తెలిపారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమంగా ఆంధ్రప్రదేశ్ ను తీసుకెళుతున్నామని చంద్రబాబు తెలిపారు. అయితే వ్యవసాయంలో కూడా మార్పులు రావాలన్నారు. లాభసాటిగా సేద్యం జరగాలంటే సాగు తీరు మారాలన్నారు. ప్రకృతి సేద్యంలో ఎవరు ముందుంటే వారికే భవిష్యత్ ఉంటుందని చంద్రబాబు తెలిపారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలోపెడుతున్నామన్న చంద్రబాబు, నాడు పొత్తు పెట్టుకున్నామని, డబుల్ ఇంజిన్ సర్కార్కారణంగానే అభివృద్ధి వేగంగా జరుగుతుందని చంద్రబాబు అన్నారు
Next Story

