Sat Dec 13 2025 22:31:41 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : తిరువూరు వివాదంపై చంద్రబాబు రియాక్షన్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరువూరు నియోజకవర్గం వివాదంపై స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరువూరు నియోజకవర్గం వివాదంలో గీత దాటిన నేతలపై త్వరలో చర్యలు తీసుకుంటున్నానని చెప్పారు. ఇప్పటికే క్రమ శిక్షణ కమిటీ చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇచ్చింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల నుంచి వివరణ తీసుకున్న క్రమశిక్షణ కమిటీ పూర్తి స్థాయి నివేదికను చంద్రబాబుకు అందించింది. అయితే దీనికి సంబంధించి నివేదికను చూసిన తర్వాత చర్యలు తీసుకుంటానని చంద్రబాబు నేతలతో అన్నారు.
48 మంది ఎమ్మెల్యేలపై సీరియస్...
మరొకవైపు రాష్ట్రంలోని 48 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా వార్నింగ్ ను చంద్రబాబు ఇచ్చారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నెల మొదటి రోజు పాల్గొనని ఎమ్మెల్యేల జాబితాను చంద్రబాబుకు పార్టీ కార్యాలయ సిబ్బంది అందించారు. మొత్తం 48 మంది ఎమ్మెల్యేలు పింఛన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని తెలిసి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆ నలభై మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు. వారి నుంచి వివరణ తీసుకోవాలని కోరారు. వివరణ సంతృప్తి కరంగా లేకపోతే చర్యలు తప్పవని ఈ సందర్భంగా చంద్రబాబు నేతలతో అన్నట్లు తెలిసింది.
Next Story

