Mon Feb 23 2026 15:56:58 GMT+0530 (India Standard Time)
Chandrababu : రాజమహేంద్రవరం ఘటనపై చంద్రబాబు రియాక్షన్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమహేంద్రవరం ఘటనపై స్పందించారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమహేంద్రవరం ఘటనపై స్పందించారు. చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్ లో స్థానికుల అస్వస్థత, మరణాలపై చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన మాట్లాడారు. బాధితులకు మెరుగైన సాయం అందించాలని ఆదేశించారు.
విక్రయదారులపై కఠిన చర్యలు...
ప్రస్తుతం బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు. 106 ఇళ్లకు పాలు పంపిణీ చేశారని అధికారులు ఈ ందర్భంగా చంద్రబాబుకు వివరించారు. పాలు వినియోగించిన 73 కుటుంబాల్లోని అందరి నుంచి రక్తనమూనాలను సేకరించామని, మిగిలిన వారి నుంచి కూడా సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపామని తెలిపారు. విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు.
Next Story

