Sun Dec 14 2025 00:19:54 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : కొత్త జిల్లాల సమస్య సర్కార్ కు తలనొప్పిగా మారుతుందా?
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజనకు ప్రభుత్వం సిద్ధమవుతుంది

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజనకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈరోజు మధ్యాహ్నం అధికారులతో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ప్రజల కోరిక మేరకు జిల్లాలను పునర్వ్యస్థీకరించాలని కూటి ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో అశాస్త్రీయంగా చేసిన జిల్లాల విభజను సరి చేస్తామని ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఇందు కోసం మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించింది. మంత్రి వర్గ ఉప సంఘం ఆ జిల్లాల్లో పర్యటించి ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుని నివేదికను చంద్రబాబు నాయుడుకు సమర్పించింది. కొన్ని ప్రాంతాలు జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటం, మరికొన్ని జిల్లా కేంద్రాలపై కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం వంటివి పరిగణనలోకి తీసుకుంది.
ఉప సంఘం సూచించిన...
జిల్లాలను పునరుద్ధరణ వ్యవస్థీకరించడం, కొత్త జిల్లాలు, పేరు మార్పులపై కొత్తగా వస్తున్న డిమాండ్లు, వివాదాలు రాజకీయ, సామాజిక చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. చంద్రబాబు మార్కాపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ఈ జిల్లా పరిధిలో మార్కాపురం, దర్శి, కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి. అన్నమయ్య జిల్లాలో మదనపల్లెకు పుంగనూరు, పిలేరు, తంబల్లపల్లె మండలాలు చేర్చాలని ప్రతిపాదన ఉంది. ఆదివాసీ ప్రాంతాల్లో రంపచోడవరం, చింతూరు మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. పోలవరం ముంపు ప్రాంతాలన్నింటితో ఓ జిల్లా ఏర్పాటు చేస్తామని గతంలో టీడీపీ అధినేత హామీ ఇచ్చారు.
అనేక పద్ధతులతో...
ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండాలని, హెడ్క్వార్టర్లకు వంద కిలోమీటర్లకు పైగా దూరం లేకుండా చూడాలని చంద్రబాబు మంత్రి వర్గ ఉపసంఘానికి సూచించారు. నూజివీడును ఏలూరు జిల్లా నుంచి ఎన్టీఆర్‌కు మార్చడం.. కైకలూరును కృష్ణా జిల్లాలో కలపడం, గూడూరును నెల్లూరుకు మార్చచడం, పెనమలూరు, గన్నవరాన్ని కృష్ణా నుంచి ఎన్టీఆర్‌కి మార్చడం, పెనమలూరును మచిలీపట్నంలో కలపడం వంటి వాటిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పేర్ల మార్పు పైనా వివాదాలు తలెత్తుతున్నాయి. నేడు రె వెన్యూ శాఖ రిపోర్ట్‌ను ముఖ్యమంత్రికి సమర్పించనుంది. క్యాబినెట్ సమావేశంలో చర్చించి వీటిపై చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశముంది. రెవెన్యూ డివిజన్ల మార్పు కూడా తలనొప్పిగా మారనుంది.
Next Story

