Wed Jan 21 2026 04:23:03 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మూడో రోజు దావోస్ లో చంద్రబాబు
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా మూడో రోజూ కీలకమైన సమావేశాల్లో పాల్గొననున్నారు.

దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా మూడో రోజూ కీలకమైన సమావేశాల్లో పాల్గొననున్నారు. దావోస్ పర్యటనలో నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనన్నారు. డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పారిశ్రామిక సెషన్ లో పాల్గొననున్న చంద్రబాబు నాయుడు హురైసిస్ ఛైర్మన్ ఫ్రాంక్ రిచర్ తో సమావేశంకానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. తమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్ సృష్టి శిబులాల్ తో సీఎం చర్చలు జరపనున్నారు.
వివిధ సంస్థల ప్రతినిధులతో...
సీఎన్ఎఫ్ హీలింగ్ ప్లానెట్ త్రూ రీజనరేటివ్ ఫుడ్ చర్చలో సీఎం పాల్గొననున్నారు. పివోట్ మార్కెట్ సిగ్నల్స్ ఫర్ నేచర్ గ్రోత్ అంశంపై చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు . బ్లూమ్ బెర్గ్ సంస్థ నిర్వహించనున్న ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏఐ మూమెంట్ ట్రాన్సాఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సెషన్ లో ముఖ్య వక్తగా ప్రసంగించనున్నారు. ఏపీ లాంజ్ లో నిర్వహించే బిల్డింగ్ ఇండియా ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో కలిసి సీఎం హాజరు అవుతారు. వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ రీజెనరేషన్ మొబిలైజింగ్ కేపిటల్ పేరిట నిర్వహించే మరో కార్యక్రమంలోనూ ముఖ్యమంత్రి పాల్గొంటారు.
Next Story

