Thu Mar 19 2026 08:33:17 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు దావోస్ కు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుు నేడు దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుు నేడు దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు పెట్టే లక్ష్యంతో ఇప్పికే పలుసార్లు విదేశాలకు వెళ్లి వచ్చిన చంద్రబాబు నాయుడు బృందం నేడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. నాలుగు రోజుల పాటు జరగనున్న ప్పరంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు పాల్గొంటారు. పెట్టుబడులను ఆహ్వానించనున్నారు.
పెట్టుబడులు పెట్టేందుకు....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమలకు ఇస్తున్న రాయితీలతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను వివరించనున్నారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ కు ఉన్న ప్రత్యేకతలను కూడా వివరించన్నారు. దావోస్ సదస్సులో చంద్రబాబు ఇరవైకి పైగా దేశాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. దీంతో పాటు వివిధ అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఏపీలో పెట్టుబడి పెట్టాలని ఆహ్వానించనున్నారు.
Next Story

