Chandrababu : 2029 నాటికి అందరికీ ఇళ్లు
2029 నాటికి అందరికీ ఇళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు

2029 నాటికి అందరికీ ఇళ్లు ఇవ్వాలంటే ఇంకా 17 లక్షల పైచిలుకు ఇళ్లు నిర్మించాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.ఈ ఏడాది జూన్ నాటికి 2 లక్షల ఇళ్లు, సెప్టెంబరుకు 1.60 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయిస్తామని చెప్పారు. రాష్ట్రంలో పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామన్న చంద్రబాబు దీపం 2.0 కింద మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తున్నాం. భవిష్యత్తులో పైప్డ్ గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. ఉచిత సిలిండర్ కు ఇచ్చే డబ్బులు ప్రతీ రెండు నెలలకూ ప్రజలకు చెల్లిస్తామని చంద్రబాబు తెలిపారు.ఇప్పుడు పైపు ద్వారా నీళ్లు వచ్చినట్టే గ్యాస్ కూడా వస్తుంది. పైప్డ్ గ్యాస్ త్వరలోనే అందుబాటులోకి తెస్తామని చంద్రబాబుఅన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి తాగునీరు ఇవ్వాల్సి ఉన్నా గత పాలకులు దానిని నిర్వీర్యం చేశారని, ఇప్పుడు కేంద్రాన్ని ఒప్పించి 2028 వరకూ ఈ పథకం కొనసాగించేలా చేసి ప్రతీ ఇంటికీ కుళాయి ద్వారా నీరందిస్తామని తెలిపారు.

